స్తోత్రం

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || ౧

ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః |
వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః || ౨

షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి |
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే || ౩

सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः ।
लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः ॥ १

धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः ।
वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बः स्कन्दपूर्वजः ॥ २

षोडशैतानि नामानि यः पठेच्छृणुयादपि ।
विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा ।
सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते ॥ ३

సుముఖః 

మనల్ని నిత్యం ఆహ్వానిస్తూ ఉండే వదనం. ఎలాంటి సమయంలో,  లేదా పరిస్థితిలో పిలిచినా పలుకుతాడు ఈ గణపయ్య   

ఏకదంత 

ఈ పేరుకి అర్ధం ఒక్క దంతం కలవాడు అని. దీనికి మనకు రెండు  పౌరాణిక గాధలు ఉన్నాయి. మొదటిది  పరశురాముడి పరశువును ఎదుర్కొని
ఈ రూపం తెచ్చుకున్నాడు స్వామీ.  ఈ రూపం లో స్వామి భరతం రాశారు, అలాగే  చ్యవన మహర్షి వల్ల పుట్టిన మదాసురుడిని ఈ రూపంలోనే సంస్కరించాడు.  
 భక్తుల కోసం తెగించే గణపయ్య రూపం ఇది   

కపిల 

కపిలవర్ణం లో ఉండే స్వామీ చాల తీక్షణంగా ఉంటాడుమనల్ని చాలా తీక్షణంగా కాస్తాడు.  
అందుకే ఈయన ఉపాసన ఆపడాలనుంచి కాపాడుతుంది అంటారు.  

గజకర్ణ 

ఏనుగు చెవులు కలవాడు. ఈ జ్ఞానమూర్తి ముందు వింటాడు.. మీరు చెప్పేవి కచ్చితంగా వింటాడు  

లంబోదర

విశ్వాన్ని తన ఉదరంలో దాచుకున్న వాడు ఈయనే మహోదరుడు అనే రూపం లో మోహాసురుడిని సంహరించాడు. అలాగే క్రోదాసురుడిని కూడా సంస్కరించాడు   

వికట 

జలంధరుడి వధ వల్ల పుట్టిన కామాసురుడిని సంస్కరించిన గణపతి స్వరూపం ఇదే. ఈయన నెమలివాహనుడు. త్రేతాయుగంలో గణపతి సాధకులకు ఈ రకంగా కనిపిస్తాడు  

విజ్ఞారాజ

శేషనాగు వాహనంగా కనిపించే ఈ గణపతినే మనం “శుక్లాంబరధరం విష్ణుం” అని ప్రార్థిస్తాం. అష్టవిజ్ఞాలకి ఈయన రాజు. అలాగే పార్వతీదేవి వల్ల పుట్టిన మామాసురుడిని సంస్కరిస్తాడు  

గణాధిప 

ఈయన సర్వగణాలకు అధిపతి.. దేవ, యక్ష, మానవ ఇత్యాది గణాలన్నింటికీ 
ఈయన అధిపతి. 

బుద్ధికుశలత ఈయన ఉపాసకులకు కరతలామలకం  

ధూమకేతు 

నల్లని వర్ణం లో ఉండేవాడు.. అలాగే అశ్వవాహనుడు. ఈయన కలియుగానికి గణనాధుడు. సూర్యుడి వల్ల పుట్టిన అహంకారాసురుడిని ఈయన ఉద్దరించాడు  

గణాధ్యక్షా 

గణాలన్నిటికి ఈయన అధ్యక్షుడు. 
ఈయన మాట దాటవేయగలవారు లేరు  

ఫాలచంద్ర 

నెత్తిన నెలవంక కాలాతీతత కి సంకేతం..  కాలాన్ని జయించిన స్వామీ అని ఈ పేరుకి అర్ధం  

గజానన 

ఈ పంచముఖ గణపతి స్వరూపం కుబేరుడివల్ల పుట్టిన లోభాసురుడిని సంస్కరించారు. మనలో లోభాన్ని మనచేతే అంతం చేయించే పరిపక్వత ప్రసాదించిన స్వామీ ఈయన. ఈ పెద్దతల దేవుడు మనగురించి మనకంటే బాగా ఆలోచిస్తాడు  

వక్రతుండ 

మత్సరాసురుడు మరియు అతని పుత్రులు సుందరప్రియుడు, విషయాప్రియుడు లను కూడా సంస్కరించారు  

శూర్పకర్ణ

అన్ని సూక్ష్మాలు తెలిసిన వాడు అని అర్ధం. చెప్పేది వినేది అన్నింటా ఈ సూక్ష్మగ్రహణ శక్తి ఈ స్వామీ ఆధీనం  

హేరంబ 

రంభ అంటే బలహీనపరిచేది అని అర్ధం.. ఇలాంటి రంభాలన్నిటిని హరించువాడు. ఈయన శక్తిరూపమైన వినాయకుడు. సింహవాహనుడు. 

మన బలహీనతలు పారద్రోలుతాడు

స్కందపూర్వజ

వ్యావహారికంగా కుమారస్వామికి అన్న.. పారమార్థికంగా చూస్తే స్కంద అంటే భుజములు అన్న అర్ధం వస్తుంది.
స్కందపూర్వజా అంటే చేతకు ముంది 
పని చేసే బుద్ధి అని అర్ధం.  

Trending

Discover more from సహనావవతు (Sahanaavavatu )

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading