
కలియుగం వచ్చేస్తుంది కలిపురుషుడు విజృంభిస్తాడు మానవులు స్మ్రుతి కోల్పోతారు, ధర్మం తెలుసుకోవాళ్ళన్నా చెప్పేవాడు దొరకడు, ధర్మం పాటిద్దాం అన్న చెప్పేవాడు ఉండదు ఆయుర్దాయం తగ్గిపోతుంది వేదాన్ని ఎవ్వరు పూర్తిగా చదివలేరు జ్ఞానాన్ని తేలికగా తెలుసుకోలేరు. ఇలా ఈ లోకానికి కలిప్రభావంగా వచ్చే సమస్యలు ఎన్నో.

- వేదాధ్యనంఅసాధ్యం కాకుండచూడాలి
- అంతటితో ఆగకూడదు ఆ వేదాలు
ప్రతిపాదించే పర బ్రహ్మను
తెలుసుకోవడాని వేదాంతాలు రావాలి.. - వాటిని ఇంకా విఫులంఅధ్యనం చేయడానికి బ్రహ్మసూత్రాలు రావాలి.
- అలాగే ఆబాలగోపాలం దేవుడి వైపు ధర్మం వైపు తిరగటానికి పురాణాలు ఇతిహాసాలు జగత్ప్రాచుర్యం చేయాలి
- అది మాత్రమే సరిపోదు తన జ్ఞానం పొందిపుచ్చుకొని తనలాగా విద్వంసులు అయిన శిష్యులను తనకు తానె తయారు చేసుకోగల గొప్ప గురువు అయి ఉండాలి.

ఇన్ని చేయాలి అంటే అప్పుడు కపిల మహర్షి లాగా వచ్చిన నారాయణుడే మళ్ళి రావాలి, కృష్ణద్వైపాయన అనే పేరుతొ పరాశరాత్మజుడిగా స్వామీ మనకోసం వచ్చాడు కూడా. ఆలా వచ్చిన ఈ గురుదేవుడు బ్రహ్మచే నియుక్తుడు కాబడి మన కోసం వచ్చాడు ఈ వ్యాసుడు #వ్యాసాయ_విష్ణురూపాయ

వేదాధ్యనం సులువు చేయడానికి వేదాన్ని నాలుగు విభాగాలుగా చేసాడు అవి
అధర్వణవేదం సుమంతులవారికి ఉపదేశింపబడింది
ఋగ్వేదం, దీనిని పైలమహర్షికఉపదేశం చేసారు. దీనిని ఆయన అనేక మందశిష్యులతో పరంపరాగతం చేసారు
యజుర్వేదం, దీనిని వైశంపాయనుడుఉపదేశంచేసారు. దీనిని 27 శాఖలుగా విభజించి తన శిష్యుల ద్వారాఆచరించడం మొదలు పెట్టారు.
సామవేదం, దీనిని జైమిని మహర్షికి ఉపడదేశం చేసారు. అనేక శాఖలుగా ఈ శ్రావణమైన సామవేదం ప్రతి ధర్మాత్ముడి మనస్సులో శంఖారావాన్ని చేసింది

అలాగే 18 పురాణాలు భారత ఇతిహాసం రచించారు దినిని రోమహర్షణుడి కుమారుడైన సూతుడికి ఇచ్చారు. సుతుడు తనతో కలుపుకొని తన 6 శిష్యులైన సయతి, అగ్నివర్చ, మిత్ర, శంకుపాల, కృతవ్రత మరియు సావర్ణి అనబడే ఆరుగురిచేత పురాణజ్ఞానం ప్రజలకు అందించారు వేద మరియు బ్రహ్మ జిజ్ఞాస పెంచారు
తరువాత బ్రహ్మసూత్రాలు తన తనయుడు సుఖమహర్షికి ఉపదేశించారు

ఇంతే కాదు వ్యాసులవారివల్లనే మన ధర్మం ఈరోజు మనం పాటించగలుగుతున్నాం
అంతే కాదు, ధనం అంటే నువ్వవాడుకొనేది, నువ్వు దానం చేసేది మాత్రమే.. నువ్వు దాచిపెట్టింది ధనం కాదు నిన్ని నాశనం చేసే నిర్ధనం అని చాటి చెప్పిన గొప్ప
సమతావాది
ఈరోజు నీకు ఆ పరమాత్మను తెలుసుకోవడానికి కావాల్సిన వేదాంతాలు
బ్రహ్మసూత్రాలు ఈయన ఇచ్చినవీ
ఆ కృష్ణభక్తి జ్ఞానం అంతెందుకు భగవద్గిత కూడా ఈయన పొందుపరచడం
వల్ల మనం చదవగలుగుతున్నాం
నిత్యకర్మలు, పితృ, దైవ,మనుష్య, భూతాదీ పంచయజ్ఞాల జ్ఞానం ఈయన వల్లనే
మనకు లభించింది
జపము, తీర్ధయాత్రలు ఇత్యాది వ్రతదీక్షలు వ్యాస స్మ్రుతి రూపంలో మనకు చెప్పింది ఈయనే
శివుడికి అభిషేకం చేయడం ఈయనే మనకు నేర్పించాడు
వైశ్వదేవ, భూతలి, అతిధిఅభాగతాదులకు సేవ, భక్తి , పవిత్ర జీవనవిధానం అన్ని వ్యాససంహత ద్వారా పొందుపరిచా దయా మూర్తి
శివ సహస్రం, సూర్య అష్టోత్తరం,విష్ణుసహస్రం, లలితా సహస్రనామం లాంటివిఎన్నో
స్తోత్రాలు ఈయనే పొందుపరిచాడు కాబట్టి ఈరోజు మనం పూజ చేస్తున్నాం అంటే ఈయన దయ
నారద భక్తి సూత్రాలు, భాగవతం వంటి గ్రంధాలు ద్వారా దేవుడికి దణ్ణం పెట్టుకోవడం కూడా ఈయనే నేర్పాడు

|| వ్యాసోచ్ఛిష్ఠం జగత్సర్వం ||
ఇలాంటి మహానుభావుడిని పొద్దున్న లేవంగానే తలచుకోవాలి అలాంటిది ఈరోజు ఈ గురుపౌర్ణమి కాదు కాదు వ్యాసపౌర్ణమి ఈరోజు. ఈరోజు ఈ మహానుభావుడికి మనవంతుగా చంద్రుడికి నూలుపోగులా ఒక్క శ్లోకం కాదు కాదు దేవుడి ముందు ఒక్క పువ్వు లేదా మనసులో దేవుడి నామం ఒక్కసారి తలచుకుందాం.




Leave a Reply